. ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పెళ్లి కూతురు పార్టీ’. మహిళా ప్రధాన చిత్రంగా దర్శకురాలు అపర్ణ రూపొందించారు. ఏవీఆర్ స్వామి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర విశేషాలు తెలుపుతూ హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఏవీఆర్ స్వామి మాట్లాడుతూ..‘వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. రెండేళ్ల కిందటే పూర్తయింది. కరోనా వల్ల ఆలస్యంగా విడుదల చేస్తున్నాం. పిల్లలు, పెద్దలు నవ్వుకునేలా సినిమా ఉంటుంది’ అన్నారు. సీత, జయత్రీ, సాయి కీర్తన్, ఫణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : శ్రీకర్ అగస్తీ.