Brendan Taylor : అంతర్జాతీయ క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డులు వరసగా చేజారుతున్నాయి. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక శతకాల యోధుడిగా విరాట్ కోహ్లీ(Virat Kohli) అవతరించగా.. టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలతో జో రూట్(Joe Root) ముందంజ వేశాడు. ఇప్పుడు వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న సుదీర్ఘ కెరీర్ రికార్డు కనుమరుగైంది. జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ (Brendan Taylor) అత్యధిక సంవత్సరాల కెరీర్‌తో టీమిండియా వెటరన్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు.
ప్రపంచ క్రికెట్లో మరో రికార్డు బద్ధలైంది. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌తో సచిన్ టెండూల్కర్‌ను బ్రెండన్ టేలర్(జింబాబ్వే) అధిగమించాడు. రెండు దశాబ్దాలకు పైగా వన్డేలను ఏలిన సచిన్ టన్నుల కొద్దీ పరుగులతో, నూరు శతకాలతో ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. కానీ, సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా మాత్రం రెండో స్థానానికి పడిపోయాడు.
Brendan Taylor breaks Sachin Tendulkar’s record for the longest career in men’s ODIs 👏 pic.twitter.com/1Z9vRinCQy
— Cricinfo (@cricinfo) September 15, 2026
వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ 22 ఏళ్ల 91 రోజులు ఆడగా.. ఇప్పుడు టేలర్ 22 ఏళ్ల 148 రోజులతో చరిత్ర సృష్టించాడు. టేలర్ 2004 ఏప్రిల్ 20వ తేదీన వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అవినీతి కేసులో మూడేళ్ల నిషేధం అనంతరం పునరాగమనం చేసిన టేలర్.. మళ్లీ మైదానంలోకి దిగాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న టేలర్.. ఇప్పటికే సుదీర్ఘ కెరీర్‌తో సచిన్‌ను అధిగమించాడు. శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య (Sanath Jayasuriya) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లంక వెటరన్ 21 ఏళ్ల 184 రోజులు వన్డే క్రికెట్ ఆడాడు.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్(2011) తర్వాత జింబాబ్వేకు సారథ్యం వహించిన టేలర్.. 2015 వరకూ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే.. అనూహ్యంగా 2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకు కారణం డ్రగ్స్(Drugs), ఆల్కహాల్. ఈ రెండింటికీ బానిసగా మారిన అతడు రిహాబిలిటేషన్ కేంద్రంలో చేరాడు. అక్కడ నిపుణుల ప్రేరణతో టేలర్‌లో మార్పు వచ్చింది. మునపటి మనిషిలా మారిన అతడు ఇంటివద్దనే కుర్రాళ్లకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రస్తుతం వన్డే, టీ20లకు సారథులగా ఉన్న సియన్ విలియమ్స్(39 ఏళ్లు), సికిందర్ రజా(38 ఏళ్లు) తనకు స్ఫూర్తి అని చెప్పాడు టేలర్.
#Cricket | Brendan Taylor broke Sachin Tendulkar’s long-standing ODI longevity record during Zimbabwe’s first ODI against Australia at the Harare Sports Club.https://t.co/qdEuXB4P0G
— NDTV Profit News (@NDTVProfit) September 15, 2026