న్యూఢిల్లీ: పాకిస్థాన్లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాక్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత రెండు రోజుల్లో 27 మంది పాక్ సైనికులను హతమార్చినట్టు వెల్లడించింది. బీఎల్ఏకు చెందిన ఫతే స్కాడ్ కలాత్లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని దాడిచేసింది.
ఈ ఘటనలో 27 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు సైనిక దళాలను కరాచీ నుంచి క్వెట్టా తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్వెట్టాలోని హజార్గంజి ప్రాంతంలో ఈఐడీని పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్టు బీఎల్ఏ ప్రకటించింది.