బ్రహ్మంగారి మఠం వారసత్వ సమస్యకు సామరస్య పరిష్కారం

మైదుకూరు: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ఏడవ తరం 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వెంకటేశ్వరస్వామి వారసుని ఎంపిక వివాదం సామరస్యంగా పరిష్కరిస్తామని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మే 8వ తేదీన వీర భోగ వెంకటేశ్వర స్వామి శివైక్యం అనంతరం పీఠం కోసం వారసుల మధ్య గట్టి పోటీ తలెత్తింది. ఈ నేపథ్యంలో శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి అధ్యక్షతన పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నది. 11వ పీఠాధిపతి పెద్ద భార్య సంతానానికి, చిన్న భార్య సంతానానికి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించి ఇరువర్గాలను సమన్వయ పరుస్తామని స్వాములు స్పష్టంచేశారు. కోర్టు వివాదాలతో బ్రహ్మంగారి మఠం ప్రతిష్ఠ దిగజారకుండా.. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

