కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిందని, ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరిగి మరో ఉద్యమాన్ని చేపట్టేందుకు సమాయత్తం అవ్వాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Bollam Mallaiah Yadav | కేసీఆర్ పోరాడి సాధించిన తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిందని, ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరిగి మరో ఉద్యమాన్ని చేపట్టేందుకు సమాయత్తం అవ్వాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం కోదాడ ఏఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన దీక్షా దివస్ సందర్భంగా నియోజకవర్గ కార్యకర్తలనుదేశించి ఆయన మాట్లాడారు. చావు నోట్లో తలపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమనేత కేసిఆర్ సాధించిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కమీషన్ల పేరిట అందిన కాడికి దండుకుంటూ నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. మూడేళ్లలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
తమ కళ్ల ఎదుటే సాగర్ ప్రాజెక్టులో అట్టడుగున ఉన్న నీటిని సైతం సొరంగం ద్వారా నీటిని తరలించకపోతుంటే నిలువరించలేని చేష్టలుడిగిన దివాలా కోరు ప్రభుత్వమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్వభష్ట ప్రభుత్వాన్ని అధికారంలోంచి దించేందుకు దీక్షా దివస్ రోజున ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు నయీమ్. చీమ నరేష్. జానకి రామాచారి. సుంకర అజయ్ కుమార్. భూపాల్ రెడ్డి. తొ గరు రమేష్. నర్సిరెడ్డి. సురేష్, శీలం సైదులు. కందిబండ సత్యనారాయణ. ఆంజనేయులు. కవిత, అప్పారావు, ఉపేందర్ గౌడ్ పాల్గొన్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

