Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Black Deer | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని కుర్సియాంగ్ (Kurseong) అడవుల్లో మరో నల్లజింక (Black Deer) ప్రత్యక్షమైంది. ఈ ఏడాది జనవరిలో ఒక నల్లజింక కనపడి అబ్బురపర్చగా.. ఇప్పుడు మరో నల్లజింక దర్శనమిచ్చింది. దుర్గాపూజ సీజన్ కావడంతో ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్, కుర్సియాంగ్ ప్రాంతాలు పర్యటకులతో కళకళలాడుతున్నాయి.
Black Deer : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని కుర్సియాంగ్ (Kurseong) అడవుల్లో మరో నల్లజింక (Black Deer) ప్రత్యక్షమైంది. ఈ ఏడాది జనవరిలో ఒక నల్లజింక కనపడి అబ్బురపర్చగా.. ఇప్పుడు మరో నల్లజింక దర్శనమిచ్చింది. దుర్గాపూజ సీజన్ కావడంతో ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్, కుర్సియాంగ్ ప్రాంతాలు పర్యటకులతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ఓ పర్యాటకుడికి ‘పర్వతాల రాణి’ గా పేరున్న కుర్సియాంగ్‌లోని దట్టమైన అడవుల్లో అరుదైన దృశ్యం కనిపించింది.
కుర్సియాంగ్ అడవుల్లో పైన్ చెట్లతో నిండిన ‘డౌ హిల్’ ఏరియాలో అత్యంత అరుదైన నల్లని జింక దర్శనమిచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కుర్సియాంగ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దేబేశ్ పాండే డౌ హిల్ ఏరియాలో ఇలాంటి జింకను మొదటిసారి గుర్తించి కెమెరాలో బంధించారు. తాజాగా అదే ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న ఒక టూరిస్ట్ మరో నల్ల జింకను చూశారు. ఓ టూరిస్ట్ బృందం ప్రకృతిని ఆస్వాదిస్తూ ‘డౌ హిల్’ అడవుల్లో నడుస్తుండగా వారిలో ఒకరికి హఠాత్తుగా నల్లని రంగులో ఉన్న జింక కనిపించింది.
ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన సదరు పర్యటకుడు వెంటనే దాని ఫొటోలను తీశాడు. జింక కనిపించిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పర్యాటకులు అరుదైన నల్లజింకను చూస్తూ ఆనందంతో పరవశించిపోయారు. జన్యుపరమైన మార్పులవల్ల అత్యంత అరుదుగా కొన్ని జంతువుల శరీరంలో ‘మెలనిన్’ అనే వర్ణద్రవ్యం అధికమవుతుందని, దాంతో అవి నల్లగా ఉంటాయని నిపుణలు చెబుతున్నారు. చిరుత శరీరంలో మెలనిన్ పెరిగి అది ‘బ్లాక్ పాంథర్’ గా మారినట్లే, ‘బార్కింగ్ డీర్’ జాతికి చెందిన జింకల్లో కూడా ఇలాంటి మార్పులు సంభవించి అవి పూర్తిగా నల్లగా కనిపిస్తాయి.
ఇలాంటి అరుదైన జన్యుమార్పు పది లక్షల జంతువులలో ఒకదానికి మాత్రమే సంభవిస్తుంది. గతంలో అటవీ శాఖ నిర్వహించిన పరిశోధనల్లో కూడా ఇలాంటి నల్లని జింకల ఉనికి గురించి కనుగొన్నారు. అంతేకాకుండా ఇటీవలి సంవత్సరాలలో ‘డౌ హిల్’, ‘బగోరా’, ‘మిరిక్’ లోని విస్తారమైన కొండ ప్రాంతాలలో నల్లని చిరుత పులులు సంచరించినట్లు అనేకసార్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే పూర్తిగా నల్లగా ఉండే ఒక జింక ఈ విధంగా బహిరంగంగా సంచరించడం మునుపెన్నడూ జరగలేదు.
వరుసగా నల్ల జింకలు కనిపించడంపై కుర్సియాంగ్ అటవీ విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ దేబేశ్ పాండే సంతోషం వ్యక్తంచేశారు. ఇది రాష్ట్ర అటవీ శాఖకు, వన్యప్రాణి ప్రేమికులందరికీ ఎంతో గర్వకారణమన్నారు. ఈ అడవులలో ఇంతకుముందు కూడా అరుదైన నల్ల జింకలు కనిపించినప్పటికీ, బహిరంగ ప్రదేశంలో ఒక నల్ల జింక కనిపించడం ఇదే మొదటిసారని అన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

