Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Heavy rain | తమిళనాడును(amilanadu) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకు చైన్నైతో(Chennai,) పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Heavy rain | తమిళనాడును(amilanadu) భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకు చైన్నైతో(Chennai,) పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు సోమవారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు.
వర్ష పాతం వివరాలు..
ప్యారిస్ 36 సెం.మీ, కత్తివాక్కం 34, చెన్నై సెంట్రల్ 27, సాత్తాంకాడు 26, తిరువొట్రియూర్, ఎన్నూర్ 22, ఎంజీఆర్ నగర్ 19, సీడీ ఆస్పత్రి తండయార్‌పేట, పెరంబూర్ 18, తండయార్‌పేట 17, వడపళని, చెన్నై కలెక్టరు కార్యాలయం 16, బేసిన్‌బ్రిడ్జ్, నుంగంబాక్కం, వైఎంసీఏ నందనం, ఆలందూర్ 15, ఐస్‌హౌస్, అన్నా వర్సిటీ, సెమ్మేడు (విళుపురం) 14, వాలాజా (రాణిపేట), మీనంబాక్కం, మాధవరం 1 సెం.మీ, మణలి, మడిప్పాక్కం, మణలి న్యూటౌన్, సాలిగ్రామం, వలసరవాక్కం, రెడ్‌హిల్స్, మనంపూండి (విళుపురం), గుమ్మిడిపూండి, మరక్కానం (విళుపురం) 12 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Heavy Rain
- IMD
- Tamilanadu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

