కేరళలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ : మెట్రోమ్యాన్ శ్రీధరన్

తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్‌గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్‌లోని మలంపుజలో హోంమంత్రి రోడ్ షో అద్భుతంగా జరిగిందన్నారు. వేలాది మంది ఉత్సాహవంతులు తరలివచ్చారని, ఇది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)ను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నానన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఆయనకు.. రాజకీయ నాయకుడిగా పని చేయడం భిన్నంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కేరళకు పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. వస్తే కేరళలో ప్రస్తుతం పరిశ్రమలు లేవని, పరిశ్రమలతోనే రాష్ట్రానికి సంపద తీసుకురాగలవని అభిప్రాయపడ్డారు. కేరళలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నందున ఉద్యోగాల కల్పన అవసరమని, విద్యావ్యవస్థ ప్రమాణాలు పెంపునకు కృషి చేస్తానని, సమర్థవంతమైన, అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 14వ కేరళ శాసన సభ పదవీకాలం జూన్ ఒకటితో ముగియనుంది. 15వ శాసన సభ ఎన్నికక కోసం 2,67,88,268 మంది అభ్యర్థులు ఓట్లు వేయనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

