Electoral bonds: ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.6,566 కోట్లు
Electoral bonds: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కన్నా.. బీజేపీకి సుమారు ఆరు రెట్లు అధికంగా ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు 1123 కోట్లు మాత్రమే వచ్చాయి. సీపీఎం పార్టీకి ఒక్క రూపాయి దక్కలేదు.
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల(Electoral bonds)ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ పార్టీలకు సమర్పించే ఆ బాండ్ల గురించి కొన్ని వివరాలు తెలిశాయి. ఆ బాండ్ల ద్వారా అధికారంలోని బీజేపీ పార్టీకి 6566 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇచ్చిన తీర్పులో కొన్ని పార్టీల లావాదేవీలు వెల్లడయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కన్నా.. బీజేపీకి సుమారు ఆరు రెట్లు అధికంగా ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు బాండ్ల రూపంలో కేవలం 1123 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని ప్రశ్నించిన సీపీఎం పార్టీ.. ఒక్క రూపాయి కూడా ఆ రూపంలో రాలేదని నిర్ధారించారు.
పార్లమెంట్లో పొందిపరిచిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 16,518 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఆయా రాజకీయ పార్టీలకు వచ్చాయి. అయితే పార్లమెంట్లో పార్టీ వివరాలను వెల్లడించలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులో ఆయా పార్టీలకు ఎంత వచ్చిందో తేలింది. ఎలక్టోరల్ బాండ్లను అందించిన దాతలు వివరాలను మాత్రం వెల్లడించలేదు.
బాండ్ల రూపంలో 2017 నుంచి 2023 మధ్య కాలంలో బీజేపీకి సుమారు 6,566 కోట్లు వచ్చాయి. బాండ్ల అందుకున్న పార్టీల్లో టీఎంసీకి 1092 కోట్లు ముట్టాయి. బీజూ జనతాదళ్‌కు 774 కోట్లు, డీఎంకేకు 616 కోట్లు, బీఆర్ఎస్కు 386 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 383 కోట్లు, టీడీపీకి 146 కోట్లు, శివసేనకు 101.38 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 94.28 కోట్లు .. బాండ్ల రూపంలో వచ్చాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

