కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 29 : కారులో ఇద్దరు కలిసి రెక్కీ నిర్వహిస్తారు.. ఖరీదైన బైక్‌లు కనిపిస్తే కొట్టేస్తారు.. ఒకరు కారులో మరొకరు బైక్‌పై పారిపోతారు. దొంగిలించిన ద్విచక్రవాహనాలపై సరదాగా తిరిగే వీరు.. పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యారు. కేపీహెచ్‌బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నం.1లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇందూరు హర్ష తన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ను ఈనెల 25న కేపీహెచ్‌బీ కాలనీలోని ఇంటి ముందు పార్కు చేయగా, ఉదయం చూసేసరికి కనిపించలేదు. అలాగే 27న కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని ఓ వైద్యశాలలో శ్యామ్సన్ పార్కు చేసిన యమహా బైక్ కూడా మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బైక్‌లు చోరీ చేసింది మహ్మద్ జహీరుద్దీన్ (23), మహ్మద్ సర్ఫ్రాజ్ అహ్మద్ (22) అని గుర్తించి.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.