పాట్నా: అవసరం ఆవిష్కరణకు అమ్మలాంటిదని అంటారు. బీహార్‌కు చెందిన గుడ్డూ శర్మ విషయంలో ఇది అక్షర సత్యం. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవడంతో పాటు హెలికాప్టర్లో ఎగురాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకోవడానికి కారునే హెలికాప్టర్‌గా మార్చేశాడతను. అవును. నానోకారును హెలికాప్టర్‌గా మార్చి రెంట్‌కి ఇస్తున్నాడు శర్మ. పెండ్లి అనంతరం వధువును హెలికాప్టర్లో అత్తవారింటికి తీసుకెళ్లాలనుకొనే వారికోసం ప్రత్యేకంగా ఈ ‘కారు హెలికాప్టర్’ను తయారుచేసినట్టు అతను చెబుతున్నాడు. శక్తిమంతమైన సెన్సర్లున్న ఈ హెలికాప్టర్ తయారీకి రెండు లక్షలు ఖర్చయినట్టు పేర్కొన్నాడు. రూ. 15 వేలకు రెంట్ ఇస్తున్నట్టు, ఇప్పటికే 19 మంది తన హెలికాప్టర్‌ను బుకింగ్ చేసుకొన్నట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అయితే, హెలికాప్టర్ తయారీకి వాడిన పరికరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.