Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video | సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని కొందరు చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. లైక్స్, వ్యూస్, ఫాలోవర్ల కోసం ప్రమాదకరమైన స్టంట్లకు తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెట్రోల్ తాగుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Viral Video | సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని కొందరు చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. లైక్స్, వ్యూస్, ఫాలోవర్ల కోసం ప్రమాదకరమైన స్టంట్లకు తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెట్రోల్ తాగుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లో జరిగినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పెట్రోల్ బంకు ఎక్కడ ఉందన్నది స్పష్టంగా తెలియరాలేదు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ తాగుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ కావాలనే ఉద్దేశంతోనే అతడు ఈ పని చేసినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. అతడు నిజంగానే పెట్రోల్‌ను మింగాడా? లేక నోట్లోకి తీసుకుని ఉమ్మేశాడా? అనేది వీడియోలో స్పష్టంగా కనిపించడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
रील के चक्कर में रियल में पी लिया पेट्रोल !
सोशल मीडिया पर एक हैरान कर देने वाला घटना सामने आया है
जिसमें एक व्यक्ति रील बनाने के चक्कर में सचमुच में पेट्रोल पीते हुए नजर आ रहा है।
यह घटना बिहार की बताई जा रही है
जो सोशल मीडिया पर काफी तेजी से वायरल हो रही है
हालांकि,इस वायरल वीडियो की आधिकारिक पुष्टि नहीं हुई है कि यह वीडियो किस पेट्रोल पंप का है
— premprakash (@pp73030711) October 22, 2026
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్ అత్యంత విషపూరితమైన పదార్థం. దాన్ని మింగితే ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలగడంతో పాటు ఇతర ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ ఊపిరితిత్తుల్లోకి చేరితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అని చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

