Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్ల జాబితాలో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. భరణి, సుమన్ శెట్టి, దివ్య, తనూజ, డీమాన్ పవన్, రాము ఈసారి నామినేషన్లలో చోటు చేసుకున్నారు. అయితే ఈసారి అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపొందిన భరణి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ సీజన్ 9 సండే స్పెషల్ దీపావళి ఎపిసోడ్లో ప్రేక్షకులని కొంత ఆశ్చర్యానికి గురి చేయనుంది. మరోవైపు ఈ ఎపిసోడ్లో కొంతమంది సెలబ్రిటీస్ షోలో ప్రత్యక్షమవుతారని సమాచారం.
భరణి మొదటి రెండు వారాలు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించగా, ఇటీవల రిలేషన్ షిప్ ఫోకస్ కారణంగా ఆటపై దృష్టి పెట్టకపోవడం, టాస్క్‌లలో సరైన ప్రదర్శన కనబరచకపోవడం వంటి కారణాల వల్ల ఆడియన్స్ లో అతనిపై కాస్త నెగెటివిటీ ఏర్పడింది. మొదటి వారం నుంచి తనజ్తో ఉన్న భరణి, దివ్య ఎంట్రీ తర్వాత ఆమెతో ఎక్కువగా సమయం గడిపినట్లు కనిపిస్తుంది. హౌస్‌లో టాస్క్‌లలో పర్ఫార్మెన్స్ లేకపోవడం, ఎమోషనల్ అనుబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల భరణి ఈ వారం ఎలిమినేషన్‌కి కారణమవుతున్నాడు. ఎలిమినేషన్ సమయంలో తనూజ బాగా ఎమోషనల్ అయ్యిందని, నాగార్జున కన్ఫెషన్ రూమ్‌లో ఆమెను ఓదార్చారని సమాచారం.
దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ మూడ్‌తో పాటు ఎమోషనల్ మోమెంట్స్‌తో కూడిన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించనుంది. భరణి ఎలిమినేషన్ కచ్చితంగా ఆడియన్స్‌కు షాక్ ఇవ్వనుంది.పూర్తి సీన్‌ను ఈ సండే ఎపిసోడ్‌లోనే చూడాల్సి ఉంటుంది.ఇక దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌కి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేయనున్నారు.