KTR : సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఆజం జాహీ మిల్లు మూతపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆజం జాహీ మిల్లు ఒకప్పుడు 10 వేల మంది ఉపాధి కల్పించిందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఆ పోస్టుకు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక సండే మ్యాగజైన్ ‘బతుకమ్మ’లో ప్రచురితమైన కథనానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను ఆయన జతచేశారు. స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని, మన బిడ్డలకు కొలువులు దొరకాలని కేసీఆర్ తపించారని, ఆ తపనతోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడుపడ్డ బీజం క్రమక్రమంగా ఎదిగివస్తూ వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు.
ఓరుగల్లు అంటే
ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు.
పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదది.
వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించి,
ప్రగతిపూల గంధాలను వెదజల్లిన నెలవు.
కానీ,
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి
ఆజం జాహీ మిల్లు మూతపడింది.స్వరాష్ట్రంలో… pic.twitter.com/Xul402KQmw
— KTR (@KTRBRS) October 19, 2025