ఇప్పుడు ఎవరినోట విన్నా పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా గురించే. ఈ సినిమా టైటిల్ పాట పాడిన కిన్నెర మొగిలయ్య ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు. ఇదే సినిమాలో మరోపాటతో దుమ్ములేపుతోంది మన తెలంగాణ మట్టిబిడ్డ కుమ్మరి దుర్గవ్వ.. ‘చెపుతున్న నీ మంచి చెడ్డ ఆంతోటి పంతాలు పోకు బిడ్డ… చిగురాకు చిట్టడవి గడ్డ అట్టుడికి పోరాదు బిడ్డ’ అనే పాటను మన దుర్గవ్వతో పాడించాడు సంగీత దర్శకుడు థమన్. అడవితల్లిమాట టైటిల్‌తో ఈ పాట యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే 5 మిలియన్ల వ్యూస్ దాటింది. మరి దుర్గవ్వకు ఈ సినిమా చాన్స్ ఎలా వచ్చింది..? దుర్గవ్వది తెలంగాణలోని ఏ ఊరు? ఆమె జీవన విధానం చూసేద్దాం రండి..