శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న ‘భాగ్‌సాలే’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సురేష్‌బాబు సమర్పణలో యష్ రంగినేని, శింగనమల కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్‌నివ్వగా సురేష్‌బాబు కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. శ్రీసింహా పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అని తెలిపారు. జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుందర్రామకృష్ణన్, ఎడిటింగ్: సత్య గిడుటూరి.