Health Tips: దగ్గును త్వరగా తగ్గించే ఇంటి చిట్కాలు..!
Health tips | జలుబు ( cold ), దగ్గు ( cough )ను మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి త్వరగా తగ్గించుకోవచ్చు.
జలుబు ( cold )తోపాటు కొందరిని దగ్గు ( cough ) బాగా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే దీనికి ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..?

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు ( cough ) నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా హెర్బల్ టీలో తేనె కలుపుకుని తాగినా దగ్గును తగ్గించుకోవచ్చు.

పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెన్ దగ్గును త్వరగా తగ్గిస్తుంది. పైనాపిల్ పండ్లను తినడం ద్వారా దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.

ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని తాగితే దగ్గు , జలుబు ( cold ) తగ్గుతుంది.

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగితే దగ్గు తగ్గుతుంది.

లవంగాలు, దాల్చినచెక్క, అల్లం రసం, మిరియాలు కలిపి వేసి తయారు చేసిన మసాలా టీని తాగడం వల్ల కూడా దగ్గు ( cough ), జలుబు ( cold ) నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి..?
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!
పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

