పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!

సాధారణంగా మనలో కొందరికి ఏ కాలంలో అయినా సరే పొడి దగ్గు వస్తుంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంది పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు. మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది. ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన, శీతలపానీయాలను ఎక్కువగా తాగడం వలన వస్తుంది. అయితే ఇలాంటి పొడి దగ్గు తగ్గాలంటే.. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. దీంతో దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
పొడి దగ్గు బాధిస్తున్నపుడు అల్లం టీని తీసుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి.
అర టీ స్పూన్ శొంటి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటే అర టీ స్పూన్ ఇంగువపొడి , ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం , ఒక టేబుల్ టీ స్పూన్ తేనె లను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు.
కరక్కాయ కూడా పొడి దగ్గును తగ్గించడంలో దోహద పడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా దగ్గును తగ్గించుకోవచ్చు.
తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

