చిన్నవయసులోనే ముఖంపై ముడతలు రావడం, జుట్టు రాలడం ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్నది. నిజానికి వయసు మీదపడటం అన్నది చాలా సహజమైన ప్రక్రియ. అయితే, ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపించడం మాత్రం ప్రమాద సంకేతమే. దీన్ని ‘ప్రిమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. ఈమధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఇది. కారణాలు అనేకం. ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా బయట తిరగడంవల్ల అతినీలలోహిత (యూవీ) కిరణాలు చర్మంలోని కొలాజిన్‌ను నాశనం చేస్తాయి. దీంతో చర్మంపై ముడతలు పడతాయి. చర్మం సాగిపోయినట్టు ఉంటుంది. జుట్టు తీవ్రంగా రాలిపోతుంది. ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, డీహైడ్రేషన్ వంటివి కూడా ప్రిమెచ్యూర్ ఏజింగ్‌కు కారణాలే. పోషకాహారం తీసుకుంటూ, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సంగీతం, ధ్యానం, పుస్తక పఠనం కూడా మానసిక విశ్రాంతికి దోహదపడతాయి. అలాగే ప్రతి విషయంలోనూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే, ఒత్తిడి దూరమై
ఆరోగ్యంగా ఉంటారు. వృద్ధాప్య లక్షణాలనూ జయిస్తారు.