Chinmoy Krishna Das | చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు
ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై (Chinmoy Krishna Das) బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదయింది. ఆయనతోపాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు.
ఢాకా: ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై (Chinmoy Krishna Das) బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదయింది. ఆయనతోపాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే దేశ ద్రోహం ఆరోపణలపై కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. గత నెల 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ఇనాముల్ హక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో తన కుడి చేయి విరిగిందని, తలకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపాడు. దాడిలో తీవ్ర గాయాలపాలవడంతో నాటి నుంచి చికిత్స పొందుతున్నాని, తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆ కథనాలు వెల్లడించాయి. కృష్ణదాస్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాడని, 164 మంది గుర్తించబడిన వ్యక్తులు, మరో 500 మంది వరకు గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నట్లు తెలిపాయి.

దేశద్రోహం ఆరోపణలపై చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు గత నెల 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న హిందువులపై పోలీసులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంస్థ సమ్మిళిత సనాతన నేత అయిన బ్రహ్మచారిని హజ్రత్ విమానాశ్రయ సమీపంలో అరెస్ట్ చేసి, అనంతరం చిట్టగాంగ్‌కు తీసుకువచ్చారు. అక్టోబర్ 25న బ్రహ్మచారి ఒక ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానపర్చారంటూ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నేత ఖలీదా జియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

