ముదిగొండ, జూన్ 27 : ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకున్నది. డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణ అనుమతి, ఇంటి నంబర్ కోసం రెండు నెలల క్రితం బాణాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాధితు డు దరఖాస్తు చేసుకున్నాడు.
పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేశ్ వద్దకు వెళ్లగా రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. సదరు బాధితుడు రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. కార్యదర్శికి బాధితుడు రూ.25 లంచం ఇ స్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నది. సురేశ్‌పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ రమేశ్ తెలిపారు.