కోటి తిట్లు..తొమ్మిది సీట్లు
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దక్కేది కోటి తిట్లు, తొమ్మిది సీట్లేనని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఎద్దేవా చేశారు. పాలన, పథకాలు అమలు చేతగాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్‌పై తిట్ల దండకం అందుకుంటున్నారని విమర్శించారు.
- కాంగ్రెస్‌కు పరాభవం ఖాయం
- మతిభ్రమించినందునే కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తిట్ల దండకం
- బీఆర్ఎస్ నేత దూదిమెట్ల
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దక్కేది కోటి తిట్లు, తొమ్మిది సీట్లేనని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఎద్దేవా చేశారు. పాలన, పథకాలు అమలు చేతగాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్‌పై తిట్ల దండకం అందుకుంటున్నారని విమర్శించారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టు సీఎం రేవంత్‌రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని ఎద్దేవా చేశారు. ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకొనేదిలేదని హెచ్చరించారు. సిట్లు వేసిన, అరెస్ట్ చేసినా భయపడేదిలేదని తేల్చిచెప్పారు. సిట్ వేయాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే వేయాలని పేర్కొన్నారు. పల్నాడు వాటర్‌గ్రిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు తరలించుకెళ్తుంటే అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని, చంద్రబాబుకు చెప్రాసీల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్‌రావు పదేపదే హెచ్చరించినా కండ్లు తెరువకుండా మొద్దునిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు.
హిట్లర్ వారసుడు రాముడెట్లవుతడు?
తనకు హిట్లర్ ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి రాముడు ఎలా అవుతాడని, ఆయన ము మ్మాటికీ రావణాసురుడని దూదిమెట్ల బాలరాజు విమర్శించారు. ప్రైవేట్ భూము ల వ్యవహారాల్లో కమీషన్లు ఎలా సంపాదించుకోవాలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆదర్శమని ఎద్దేవా చేశారు. క్షుద్రపూజలు చేస్తున్నారని హరీశ్‌రావుపై అడ్డదిడ్డంగా మాట్లాడిన మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఉపేంద్రాచారి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరి మల్లప్ప పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

