అచ్చంపేట రూరల్ : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బిజెపి జిల్లా కార్యదర్శి బలమూరు జానకి అన్నారు. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నలు లేవనెత్తిన అచ్చంపేట రూరల్ మండలం బిజెపి అధ్యక్షురాలు కాట్రావత్ జ్యోతి.. మహా పాదయాత్ర చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అక్రమంగా పోలీసులను ఇండ్లకు పంపించి అరెస్టు లు చేస్తున్నదని విమర్శించారు.
శనివారం బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. ముఖ్య నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అన్నారు. ఈ అరెస్టులు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి? దేవాలయంలో అవినీతి జరుగుతోందని ప్రజలు చెబుతున్నప్పుడు, దానిని దర్యాప్తు చేసి నిజాన్ని వెలికితీయాల్సిన ప్రభుత్వం, పోరాటం చేస్తున్నవారిని అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.