మెల్బోర్న్, డిసెంబర్ 22: వారు పిల్లలు కాదు పిడుగులు. ఆస్ట్రేలియాలో ఓ ఆరేండ్ల పాప తన తోబుట్టువులతో కలిసి దుకాణానికి వెళ్లి చాక్లెట్ కొన్నంత సులువుగా ఓ బంగళాను కొనేసింది. పెద్దలిచ్చిన పాకెట్‌మనీ పోగేసి 6,71,000 ఆస్ట్రేలియా డాలర్లకు (సుమారు రూ.3.6 కోట్లు) దానిని సొంతం చేసుకున్నది. పాప తండ్రి ఓ రచయిత. పేరు మెక్‌లెలాన్. ఆస్తులు పోగేయడం ఎలా, హాయిగా జీవించడం ఎలా? అనే అంశాలపై పుస్తకం రాశారు. ఆ పుస్తకం ప్యాకింగ్‌లోనూ పాప సాయపడితే ఆమెకు, తోబుట్టువులకు కొంత వాటా ముట్టజెప్పారు. ఆరేండ్ల రూబీ, ఆమె అన్న గస్, అక్క లూసీ ముగ్గురూ తలా 2000 ఆస్ట్రేలియా డాలర్ల సొమ్ము పోగేసి బంగళా కొన్నారు.