ముంబై: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. అన్ని ఫార్మాట్లలో టాప్ ప్లేస్‌ను కొట్టేసే పనిలో పడ్డారు. తాజాగా రిలీజైన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతను మూడవ స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పటికే టీ20లు, వన్డేల్లో అతను ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నాడు. శ్రీలంకతో గాలేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఉత్తమ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ ర్యాంకుల్లో దూసుకెళ్లాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి బాబర్ ఆజమ్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో జోరూట్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
వన్డేలు, టీ20ల్లో తొలి ర్యాంక్‌లో ఉన్న బాబర్.. టెస్టు క్రికెట్లో 874 పాయింట్లతో టాప్ 3లో ఉన్నాడు. మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్న జో రూట్ ఖాతాలో 923 పాయింట్లు, లబుషేన్ ఖాతాలో 885 పాయింట్లు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ కావాలన్నదే తన ధ్యేయమని ఇటీవల బాబర్ ఆజమ్ పేర్కొన్న విషయం తెలిసిందే.