వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే వన్డే అతనికి చివరి మ్యాచ్ కానున్నది. అయితే వచ్చే నెలలో స్వంత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు మాత్రం ఫించ్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వన్డేల్లో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని, అద్భుతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించాను అని, ఆ ప్రయాణంలో ఎంతో మంది ప్లేయర్లు అండగా నిలిచారని ఫించ్ తన ప్రకటనలో తెలిపాడు. వచ్చే ప్రపంచ కప్ కోసం కొత్త నాయకున్ని తయారు చేయాలని, తనకు సహకరించిన వారికి ఫించ్ కృతజ్ఞతలు తెలిపాడు. 50 ఓవర్ల క్రికెట్లో ఇటీవల ఫించ్ ఫామ్ పేలవంగా ఉంది. గడిచిన 12 ఇన్నింగ్స్‌లో అతను కేవలం 169 రన్స్ మాత్రమే చేశాడు. దాంట్లో అయిదు డక్‌లు ఉన్నాయి. చివరి ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం 26రన్స్ మాత్రమే చేశాడతను. వన్డేల్లో ఫించ్ 5400 రన్స్ చేశాడు. దాంట్లో 17 సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

