మెర్సిడెజ్, బీఎండబ్ల్యూలకు ‘ఆడి న్యూ ఎస్5 స్పోర్ట్ బ్యాక్’ సవాల్

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి దేశీయ విపణిలోకి న్యూ ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ కారును సోమవారం ఆవిష్కరించింది. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్లోని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారు ధర రూ.79.06 లక్షలుగా నిర్ణయించారు. మెర్సిడెస్-ఏఎంజీ సీ 43, మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ 43 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం340ఐ తదితర కార్లకు ఆడి న్యూ ఎస్5 గట్టి పోటీ ఇవ్వనున్నది.
అత్యాధునిక ఫీచర్లతో స్పోర్టీ లుక్
2017లోనే ఎస్5 స్పోర్ట్ బ్యాక్ మోడల్ కారు భారత మార్కెట్లో అడుగు పెట్టింది. తాజాగా పలు అత్యాధునిక ఫీచర్లతోపాటు కారు ఔటర్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు న్యూ ఎస్ 5 కారు మరింత స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. షార్పర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్లు అదనపు ఆకర్షణ. యాంగులర్ బంపర్, క్వాడ్ టిప్ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, స్పాయిలర్ తదితర ఫీచర్లతో న్యూ ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఆకట్టుకుంటున్నది.
ఇన్ఫోటైన్మెంట్ ఫీచర్లు ఇలా
పది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, 12.2 అంగుళాల డిజిటల్ ఎంఐడీ తెర, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లున్నాయి. ఇందులో 3.0 ట్విన్ టర్బో, వీ 6 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 354 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్ఎం టార్చ్‌ను విడుదల చేస్తుంది.
4.8 సెకన్లలో 100 కి.మీ వేగం
8 – స్పీడ్ ట్రిప్ ట్రోనిక్ గేర్‌బాక్స్ గల ఈ కారు 4.8 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగం అందుకుంటుంది. న్యూ ఎస్5 కారులో గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించే వెసులుబాటు ఉంది. డైనమిక్, కంఫర్ట్, ఎఫీషియెన్సీ, ఆటో, ఇండివిడ్యుయల్ అనే ఐదు డ్రైవింగ్ మోడ్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పుల ఊబిలో కుటుంబాలు.. తగ్గిన సేవింగ్స్!
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

