న్యూయార్క్‌లో మెరుపు వానలు.. 44 మంది మృతి
న్యూయార్క్ | గంట వ్యవవధిలో 80 మిల్లీమీటర్ల వర్షం.. ఎక్కడ చూసిన నీరే.. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. బేస్మెంట్లు, సబ్‌వేలు నీటితో నిండిపోయాయి.. ఇదీ అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి.

న్యూయార్క్: గంట వ్యవవధిలో 80 మిల్లీమీటర్ల వర్షం.. ఎక్కడ చూసిన నీరే.. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. బేస్మెంట్లు, సబ్‌వేలు నీటితో నిండిపోయాయి.. ఇదీ అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీలో పరిస్థితి. న్యూయార్క్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం రాత్రి వరణుడు తన ప్రతాపం చూపించాడు. కుంభవృష్టి కురవడంతో గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. ఐడా తుఫాను ధాటికి వరదలు, బేస్మెంట్లలో చిక్కుకుని సుమారు 44 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ పూర్తిగా నీటమునిగాయని వెల్లడించారు.

దీంతో న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితి విధించినట్లు గవర్నర్ కేటీ హోచుల్ ప్రకటించారు. సబ్‌వేలను మూసివేశామని, రైళ్లను కూడా ఆపివేశామని తెలిపారు. లగార్డియా, జేఎఫ్‌కే విమానాశ్రయాలు ముంపునకు గురవడంతో వందల కొద్ది విమానాలను రద్దు చేశామన్నారు. పట్టణంలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారని, మరో 11 మంది బేస్మెంట్లలో చిక్కుకుపోయారని వెల్లడించారు. అందులో 2 నుంచి 86 ఏండ్ల వయస్సులో ఉన్నవారే ఉన్నారన్నారు.

కాగా, తనకు ఇప్పుడు 50 ఏండ్ల వయస్సు ఉందని, ఇప్పటివరకు ఇలాంటి వానను తానెప్పుడూ చూడలేదని మెటోడిజా మిహజ్లోవ్ అనే వ్యక్తి చెప్పారు. తన రెస్టారెంట్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరిందన్నారు.

న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద గంట వ్యవధిలో 80 మిల్లీమీటర్లు (3.15 ఇంచ్‌లు) వర్షపాతం నమోదయిందని నేషనల్ వాటర్ సర్వీస్ (NWS) వెల్లడించింది.

ఇక న్యూజెర్సీలో ఐడా తుఫాను ధాటికి 23 మంది చనిపోయారని గవర్నర్ ఫిల్ మర్ఫీ తెలిపారు. సుమారు 60 వేల ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

