Asaduddin Owaisi Condemns BJP’s AI Video| అస్సాం ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అస్సాం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఒక ఏఐ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై ఇప్పటికే బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరితో పాటు పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా ఈ వీడియోపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ పాలన లేకపోతే అస్సాం ముస్లింలు అధికంగా ఉండే రాష్ట్రంగా మారిపోతుందని ఈ వీడియోలో చూపించగా.. దీనిపై అసద్ స్పందిస్తూ.. ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్న భయపెట్టే ప్రచారం మాత్రమే కాదని బీజేపీ అసలైన హిందూత్వ భావజాలం ఇదేనని ఆయన అన్నారు.
“భారతదేశంలో ముస్లింలు ఉండడమే వారికి సమస్య. ముస్లిం-ముక్త్ భారత్ వారి కల. ఈ నిరంతర విమర్శలు, ఏడుపు తప్ప దేశం కోసం వారికి ఎటువంటి అభివృద్ధి లేదు అని ఒవైసీ పేర్కొన్నారు. ఈ వీడియో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని, ఇలాంటి చర్యలను ఖండించాలని ఒవైసీ పిలుపునిచ్చారు.
BJP Assam has posted a disgusting AI video that shows a Muslim-majority Assam if there was no BJP. They are not fear-mongering just for votes, this is the repulsive Hindutva ideology in true form. The very existence of Muslims in India is a problem for them, their dream is a…
— Asaduddin Owaisi (@asadowaisi) September 17, 2025
We can’t let this dream of Paaijaan to be true!! pic.twitter.com/NllcbTFiwV
— BJP Assam Pradesh (@BJP4Assam) September 15, 2025