ఈయన బొమ్మ గీస్తే రోజూ చూసే హనుమంతుడైనా కొత్తగా కనిపించాల్సిందే !!
Artist Raghavendra Drawings | ఆయన కుంచెకు వర్ణాలన్నీ వంతపాడుతాయి. క్యాన్వాస్‌ను మూలమూలనా రంగులు అందంగా పరుచుకుంటాయి. అపురూప చిత్రరాజాలుగా రూపుదిద్దుకుంటాయి. మనం చిన్నప్పటి నుంచీ చూస్తున్న హనుమంతుడే.. సరికొత్తగా కనిపిస్తాడు. ‘హనుమ నా ఇష్టదైవం. క్యాన్వాసు మీద సునాయాసంగా ఒదిగిపోయే అందమైన రూపం కూడా’ అంటారు చిత్రకారుడు అప్పం రాఘవేంద్ర (రాఘవ). ఆయన బొమ్మల్లో తెలంగాణ ఆత్మ ఉంటుంది. పల్లెలు కనిపిస్తాయి. వాడకట్టు దర్శనమిస్తుంది. ముచ్చట్లు పెట్టుకున్న అమ్మలక్కలకు అంతకు ముందులేని అందమేదో వచ్చి చేరుతుంది.

రంగుల్లోని వైవిధ్యాలకు కొత్త హంగులు దిద్దడంలో సిద్ధహస్తుడు రాఘవేంద్ర (రాఘవ). సాంస్కృతిక, సంప్రదాయ చిత్రాలకు జీవం పోస్తూ ఉత్తమ చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ఎల్లలు దాటి ఇండియన్ ఆర్ట్స్ కలెక్టర్ ఆన్లైన్ గ్యాలరీలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల ప్రశంసలు పొందుతున్నాయి. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కుంచె ఏ రూపాన్నైనా కొత్తగా ఆవిష్కరిస్తుంది. కుటుంబ సహకారంతో చిత్రకారుడిగా ఎదిగానని చెబుతారు రాఘవ. చిత్రకళా పాఠాలు చెప్పిన జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆవరణ ప్రభావమూ ఆయన మీద ఎక్కువే.

… రాజు పిప్పాలా
ఫొటోలు : ఉప్పరి శివకుమార్

Read More :
“గ్రామీణ జీవితానికి అద్దంపడుతున్న మెతుకుసీమ సిత్రాలు”
Batik Art | జావా దీవుల్లో పుట్టిన ఈ కళ మన దేశంలో ఎలా ఫేమస్ అయింది? దీని స్పెషాలిటీ ఏంటి?
Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..
Thoti Tribes | గోండుల ఇండ్లల్లో పెండ్లయినా.. చావైనా.. వీళ్లు రావాల్సిందే !!
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

