Batik Art | జావా దీవుల్లో పుట్టిన ఈ కళ మన దేశంలో ఎలా ఫేమస్ అయింది? దీని స్పెషాలిటీ ఏంటి?
Batik Art | బాతిక్.. చిత్రకళల్లో ప్రత్యేకమైనది. మైనంతో బొమ్మలు వేసే విభిన్న ప్రక్రియగా పేరు గాంచింది. జావా దీవుల్లో పుట్టి.. క్రీ.శ. 2వ శతాబ్దంనాటికి మనదేశంలో అడుగుపెట్టింది.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘బాతిక్ చిత్రకళ’ ఎంతో ప్రాచీనమైనది. ఈ కళకు పుట్టినిల్లు జావా దీవులు. ఇండోనేషియా, మలేషియా దేశాల్లో జనాదరణ పొందింది. మనదేశంలోనూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా తనను తాను మార్చుకున్నది. మహిళల మనసు దోచేలా చీరలు, లంగా ఓణీలతోపాటు కర్టెన్లు, కవర్లు, దుప్పట్ల లాంటి గృహోపకరణాలపై అందమైన బొమ్మల రూపంలో కొలువుదీరుతున్నది.

విభిన్నం.. తయారీ విధానం
‘కలంకారీ’ని పోలిన బాతిక్ చిత్రకళ రూపకల్పనలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. నూలు వస్త్రం, పట్టు వస్త్రంపైనా బాతిక్ చిత్రం వేస్తారు. అయితే, మిగతా పెయింటింగ్స్ లాగా ఈ కళలో నేరుగా వస్త్రాలపై రంగులు వేయడం కుదరదు. ముందుగా తెల్లని వస్త్రంపై కావలసిన బొమ్మను పెన్సిల్‌తో గీస్తారు. తేనెపట్టు మైనం, పారాఫిన్ మైనాన్ని సమపాళ్లలో కలిపి వేడిచేసి, మరిగిస్తారు. ఒక సన్నని వెదురు కర్రకు రెండు ఇనుప చువ్వలను ఒక అంగుళం మేర బయటికి ఉండేలా గట్టిగా కడతారు. దీనికి కండె ఆకారంలో దారాన్ని చుడుతారు. దీనిని మరుగుతున్న మైనంలో ముంచి, అప్పటికే గుడ్డపై పెన్సిల్‌తో వేసిన బొమ్మల గీతలపై గీస్తారు.

ఇనుప చువ్వల ద్వారా కారిన మైనం.. పెన్సిల్ గీతలను కప్పేస్తుంది. ఆ తర్వాత వస్త్రంపై కావాల్సిన రంగులను అద్దుతారు. అనంతరం వేడి నీటిలో ఈ వస్త్రాన్ని ముంచితే, మైనం కరిగిపోతుంది. ఆ తర్వాత మరొక రంగు కోసం ఇదే ప్రక్రియను పునరావృతం చేస్తారు. ఇలా ఎన్ని రంగులు కావాలంటే అన్నిసార్లు ఇదే ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. బొమ్మల మధ్యలో ఖాళీ స్థలాన్ని పూరించడానికి నెఫ్తాలీ రంగులను ఉపయోగిస్తారు. చివరలో వేడి నీళ్లను మరిగించి, సర్ఫ్ వేసి మైనపు గుడ్డను అందులో ముంచుతారు. తద్వారా మైనం మొత్తం తొలగిపోయి వస్త్రం శుభ్రమవుతుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక తయారైన చిత్రాన్ని బాతిక్గా వ్యవహరిస్తారు.

మన ఆణిముత్యం..
బాతిక్ కళనే తన ఇంటి పేరుగా మార్చుకొని ‘బాతిక్ బాలయ్య’గా పేరొందాడు యాసాల బాలయ్య. సిద్దిపేట సమీపంలోని ఇబ్రహీంపూర్‌కు చెందిన బాలయ్య, బాల్యం నుంచే చిత్రకళ పట్ల ఆకర్షితుడయ్యాడు. తనలోని ఆసక్తిని గమనించి ప్రముఖ చిత్రకారుడు డా. కాపు రాజయ్య చిత్రకళలో మెలకువలు నేర్పారు. అనంతరం ప్రముఖ చిత్రకారుడు, పద్మశ్రీ లక్ష్మాగౌడ్ శిష్యరికంలో బాతిక్ కళలో ఆరితేరాడు బాలయ్య. ప్రకృతి, పండుగలు-పబ్బాలు, సమస్త గ్రామీణ జీవితానికి అద్దంపట్టే బాతిక్ చిత్రాలకు రూపకల్పన చేశాడు. నాటి రాష్ట్రపతి డా. శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ చిత్రకళోపాధ్యాయుడు అవార్డును అందుకొన్నారు. తన జీవితాన్ని ఈ కళకే అర్పించిన బాలయ్య.. బాతిక్ కళ గురించి సమగ్ర గ్రంథాన్ని కూడా రచించారు.

బాతిక్ పద్ధతిలో చిత్రం వేయడానికి కళాకారుడికి శ్రద్ధ, ఓపిక, సహనం, ఏకాగ్రత అవసరం. ఈ చిత్రాలను గృహాలంకరణకు వాడతారు. వస్త్రాలుగానూ ధరిస్తారు. దేని అందం దానిదే!

… అరవింద్ ఆర్య, 7997 270 270
Read More :
Gollabhama Sarees | సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లోనే తయారయ్యే ఈ చీరల స్పెషాలిటీ ఏంటంటే..
Thoti Tribes | గోండుల ఇండ్లల్లో పెండ్లయినా.. చావైనా.. వీళ్లు రావాల్సిందే !!
అంతరించిపోతున్న కూనపులి కళను కాపాడుతున్న ఒకే ఒక్కడు.. అసలు దాని ప్రత్యేకత ఏంటి?
కాటికి తోడుగా వచ్చే కాటికాపరుల గురించి ఈ విషయాలు తెలుసా!
ఈ యుద్ధ కళ తెలిసి చేతిలో కర్ర ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే
Burra katha | బుర్ర కథకు ఆ పేరెలా వచ్చింది? అసలు ఫస్ట్ ఇవి ఎలా రూపొందాయి?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- culture
- inspiration
- Tradition
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

