Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండి..!
Health tips : సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. డయాబెటిస్ లేని వారితో పోల్చితే డయాబెటిస్ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని పలు పరిశోధనలు కూడా తేల్చాయి. కాబట్టి గుండెను కాపాడుకోవాలంటే ముందుగా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. షుగర్‌ను అదుపు చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Health tips : సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాళ్లతో పోల్చితే మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఎక్కువ. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. డయాబెటిస్ లేని వారితో పోల్చితే డయాబెటిస్ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువని పలు పరిశోధనలు కూడా తేల్చాయి. కాబట్టి గుండెను కాపాడుకోవాలంటే ముందుగా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. షుగర్‌ను అదుపు చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ఆరోగ్యకరమైన డైట్
డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు తాము తీసుకోవాల్సిన, తీసుకోగూడని ఆహారాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ స్థాయిలు అధికంగా ఉండే ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకపోవడం ఉత్తమం.
2. శారీరక వ్యాయామం
షుగర్ సమస్య ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. యోగాసనాలు వేయడం, ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
3. నిపుణుల పర్యవేక్షణలో మెడికేషన్
షుగర్ మెడిసిన్ ఎలా పడితే అలా వాడకూడదు. ఎండోక్రైనాలజిస్ట్ లేదా డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించి వారు రాసిన మెడికేషన్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాక మెడిసిన్ వైద్యుడు చెప్పిన సమయానికి తీసుకోవాలి. సమయపాలన, రెగ్యులారిటీ లేకుండా ఔషధాలను వినియోగించడంవల్ల సరైన ఫలితం ఉండదు.
4. బరువును అదుపులో ఉంచడం
షుగర్ పేషెంట్లు కొందరు వెయిట్ లాస్ అయితే, మరి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఇవి రెండూ ప్రమాదకరమే. కాబట్టి బరువును అదుపులో పెట్టుకోకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది.
5. కండ్లను కాపాడుకోవడం
డయాబెటిస్ అదుపు తప్పితే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే కంటి లోపలి భాగాలు దెబ్బతిని చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.
6. మూత్ర పరీక్షలు
షుగర్ పేషెంట్లు క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల ప్రొటీన్ లీకేజీ ఏమైనా ఉన్నదా, సీరమ్ క్రియాటినైన్ ఎంత ఉన్నది అనే వివరాలు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

