Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Health tips : శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం. ఇంతలా వేధించే ఈ నోటిపూత సమస్య నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడవచ్చు. మరి ఆ సింపుల్ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Health tips : శరీరంలో వేడి ఎక్కువగా ఉండే వాళ్లను, పంటి ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లను నోటిపూత (నోట్లో పుండ్లు పడటం) తీవ్రంగా వేధిస్తుంది. నోటిపూత వల్ల భయంకరమైన నొప్పి ఉంటుంది. పుండు నోట్లో ఎక్కడ ఉన్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అయితే వేడి బాగా ఉన్నప్పుడు నోరంతా పుండ్లు పడుతాయి. ఇక ఆ నరకయాతన వర్ణనాతీతం. ఇంతలా వేధించే ఈ నోటిపూత సమస్య నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడవచ్చు. మరి ఆ సింపుల్ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..
చిట్కాలు
- కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. కొబ్బరి నీళ్లకు ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గి సమస్య పరిష్కారమవుతుంది.
- ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. ఇలా ఎండు కొబ్బరిని నమలడంవల్ల కూడా అల్సర్ పుండ్లలోని సూక్ష్మజీవులు నశించిపోతాయి. దాంతో నోటిలో అల్సర్స్ త్వరగా తగ్గిపోతాయి.
- అల్సర్ ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనె రాయడంవల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
- తరచూ చల్ల తాగడంవల్ల కూడా అల్సర్స్ సమస్యకు పరిష్కారం ఉంటుంది. చల్లకు కూడా శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉన్నది.
- గసగసాలు కూడా నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. గసగసాలు కలిపిన నీటిని తరచూ తాగుతూ ఉండటంవల్ల సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు.
- అదేవిధంగా తులసి ఆకులను నములుతూ దాని ద్వారా వచ్చే రసాన్ని మింగడం ద్వారా కూడా నోటిపూతకు పరిష్కారం లభిస్తుంది.
- గమనిక : పై చిట్కాలు సమస్య రాకుండా చూసుకోవడానికి, వచ్చిన సమస్య నిదానంగా తగ్గడానికి తోడ్పడుతాయి. ఒకవేళ మీకు నోరంతా పుండ్లుపడి భరించలేకుండా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి మెడికేషన్ తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

