మహదేవపూర్, జూన్ 26 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని టస్సార్(దసలిపట్టు) కాలనీని గురువారం ఏపలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సహాయ పట్టుపరిశ్రమ అధికారి జీవీ హరికృష్ణ ఆధ్వర్యంలో చింతూర్, రంపచోడవరానికి చెందిన సుమారు 60మంది మహిళలు సందర్శించారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను, తయారు చేసే విధానాన్ని పరిశీలించారు.
కాలనీకి చెందిన చేనేత కార్మికులు గొర్రె బాపు, శంకరయ్య శ్రీనివాస్ దసలి పట్టు పరిశ్రమ, టస్సార్ మహిళలు (దసలిపట్టు) దారం తీసే విధానం, మగ్గాల పై చీరెలు నేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో మండల సెరికల్చర్ అధికారి సమ్మయ్య, పట్టుపరిశ్రమ సాంకేతిక సహాయకుడు రవి కుమార్, సారయ్య, చేనేతకార్మికులు పాల్గొన్నారు.