AP News : వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి ఆయన సోమవారం మరింత క్లారిటీ ఇచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు తదితర పూర్తి ప్రణాళికను తెలియజేస్తానని వెల్లడించారు. విజయవాడ వేదికగా అధికారికంగా ప్రకటన చేస్తానని స్పష్టంచేశారు.
ప్రజాసమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు.