AP news | చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్
AP news | ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను వంచిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద అరకొర నిధులు విడుదల చేసి, వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.
AP news : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను వంచిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద అరకొర నిధులు విడుదల చేసి, వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మొదటి విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది. పీఎం-కిసాన్ పథకం నిధులతో కలిపి సుమారు 46.86 లక్షల రైతు కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరింంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5,000, కేంద్రం వాటాగా రూ.2,000 కలిపి ప్రతి లబ్ధిదారుడికి మొత్తం రూ.7,000 చొప్పున అందాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల.. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా.. కేవలం కొంతమందికి మాత్రమే నిధులు కేటాయించారంటూ ఆమె ఆక్షేపణ వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, పంటల బీమా వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Police Raids | అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల మెరుపు దాడులు .. నాలుగు టిప్పర్లు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

