Anushka Sharma : బాలీవుడ్ నటి అనుష్కా శర్మ నటిస్తున్న కొత్త చిత్రం ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ పూర్తయ్యింది. దాంతో ఆమె సెట్స్‌లో చివరి రోజు యూనిట్‌తో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అనుష్క, మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామి, డైరెక్టర్ ప్రొసిత్ రాయ్‌తో కలిసి కేకు కట్ చేసింది. రెండు వరుసల కేకు మీద ఝులాన్ జెర్సీ నంబర్ 25 ఉంది. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్ షూటింగ్ పూర్తయింది. చివరి క్లాప్ కొట్టి, సినిమా షూటింగ్‌ను ముగించిన ఝులన్‌కు థాంక్యూ. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది’ అని అనుష్క ఆ పోస్టుకి క్యాప్షన్ రాసింది. 2017 డిసెంబర్లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క నాలుగేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పాప వామిక పుట్టిన తర్వాత ఆమె చక్‌దే ఎక్స్‌ప్రెస్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెత్తిన ఈ చిత్రంలో అనుష్క లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా షూటింగ్‌కు ఎన్ని రోజులు పట్టింది? ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు? అనే వివరాలు క్లాప్‌బోర్డు మీద రాసి ఉన్నాయి. 65 రోజులు, 7 షెడ్యూల్స్, 6 నగరాల్లో ఈ సినిమాను తీశారు. ప్రొసిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఝులన్ 2002లో ఆరంగ్రేటం చేసింది. 12 టెస్టులు, 204 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు తీసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ అనంతరం ఆమె క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.