ఆంథ్రోపిక్‌కు రూ.7.60 లక్షల కోట్ల నష్టం
కృత్రిమ మేధస్సు (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్ భీకర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నది. చాట్‌బోట్ క్లౌడ్‌ను సృష్టించి ఏఐ మార్కెట్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం.. ఈ జనవరి-జూన్‌లో రూ.7.60 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లకు పైగా) నికర నష్టాన్ని చవిచూసినట్టు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది. వచ్చే నెలలో ఐపీవోకు ప్రయత్నిస్తున్న ఈ సంస్థ నష్టాలు.. ఏడాది కిందట 13 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 21: కృత్రిమ మేధస్సు (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్ భీకర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నది. చాట్‌బోట్ క్లౌడ్‌ను సృష్టించి ఏఐ మార్కెట్లో సంచలనాన్ని రేకెత్తించిన ఈ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం.. ఈ జనవరి-జూన్‌లో రూ.7.60 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లకు పైగా) నికర నష్టాన్ని చవిచూసినట్టు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది. వచ్చే నెలలో ఐపీవోకు ప్రయత్నిస్తున్న ఈ సంస్థ నష్టాలు.. ఏడాది కిందట 13 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి.
అయితే ఈ నష్టాలకు ప్రధాన కారణం కన్వర్టబుల్ నోట్ల విలువలో మార్పులకు సంబంధించిన చార్జీలు, ఫండింగ్ కోసం కంపెనీ జారీ చేసిన ఇతర ఆర్థిక సాధనాలేనని అంటున్నారు. 2025లోనూ ఆంథ్రోపిక్ నికర నష్టాలు 42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని రాయిటర్స్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే రాబోయే కొన్నేండ్లలో మరింతగా కంప్యూటింగ్ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ సంస్థ 750 బిలియన్ డాలర్లదాకా ఖర్చు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఏఐ మార్కెట్లో నెలకొన్న భయాలు, పెరుగుతున్న వ్యయాలు- వాటిల్లుతున్న నష్టాల మధ్య ఆంథ్రోపిక్ ఐపీవో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

