ANNAPURNAMA| ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణుల నోటి నుండి కమిట్మెంట్ అనే పదం వినిపిస్తుంది. యాంకర్స్, హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి ఫలానా హీరో కమిట్మెంట్ అడిగాడని, ఫలానా దర్శకుడు లేదంటే నిర్మాత కమిట్మెంట్ ఇస్తేనే సినిమా అవకాశం ఇస్తానన్నాడని చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కమిట్మెంట్ గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు.
అయితే కమిట్మెంట్ అనే విషయానికి వస్తే ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు బలవంతం పెట్టరు.. అది వారి ఇష్టంగానే జరుగుతూ ఉంటుంది. ఆరోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవి, వాటిని కమిట్మెంట్ అని కూడా అనలేము. నేను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేశాను కాబట్టి నన్ను అలా ఎవరూ అడగలేదు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇండస్ట్రీలో బలవంతం అయితే ఎవరూ చేయరు. మీడియాలో హైలైట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారు అని పేర్కొంది. ఇండస్ట్రీ అనేది మన అందరిదీ దాన్ని కరెక్ట్ గా వినియోగించుకుంటేనే అవకాశాలు మనకి వస్తాయి అంటూ అన్నపూర్ణమ్మ తెలియజేసింది.
ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. అన్నపూర్ణమ్మ గతంలో ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రలు పోషించి అలరించింది. ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. ఈమధ్య వయస్సు రీత్యా తక్కువ సినిమాలలో నటిస్తున్న అన్నపూర్ణమ్మ పలు టీవీ షోలలో సందడి చేస్తూ వస్తుంది. అలానే కొన్ని ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తనకి హీరోలలో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య వంటి హీరోలు నాతో మంచిగా ఉంటారని కుటుంబం లా ఉండేవాళ్లమని అన్నపూర్ణమ్మ పేర్కొంది.