కట్టంగూర్, జూన్ 24 : కట్టంగూర్ ఎంపీడీఓగా జి.అంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కట్టంగూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా బుధవారం ఆయన కట్టంగూరు ఎంపీడీఓగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.