కైరో : ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాల రజత పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో అనీశ్ను రజతం వరించింది.
రెండో స్థానం కోసం జరిగిన పోరులో ఉక్రెయిన్ మాక్సిమ్ హోర్డెనెట్స్తో నువ్వానేనా అన్నట్లు తలపడ్డ అనిశ్ 28 స్కోరుతో వెండి పతకం ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు జరిగిన అర్హత పోటీల్లో భన్వాల 585 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు.