ఏపీలో రూ.81 లక్షలకు సర్పంచ్ ఏకగ్రీవం
ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కాకముందే ఏకగ్రీవాల పర్వం ఊపందుకుంది.ఎన్నికల ఖర్చులు, వివాదాలు లేకుండా ఏకగ్రీవాల వైపు గ్రామస్తులు సర్పంచ్ పదవుల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కాకముందే ఏకగ్రీవాల పర్వం ఊపందుకుంది.ఎన్నికల ఖర్చులు, వివాదాలు లేకుండా ఏకగ్రీవాల వైపు గ్రామస్తులు సర్పంచ్ పదవుల కోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ఐదువేల జనాభా ఉన్న ఈ పంచాయతీకి తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేసేందుకు రెండు ప్రధాన పార్టీల నేతలు నిర్ణయించారు. సర్పంచ్ పదవి కోసం ముగ్గురు పోటీ పడటంతో, వేలం పాటలో గోపాలరావు రూ.77లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా.. ఆయన కంటే యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో ఏకగ్రీవంగా శ్రీనివాసరావును గ్రామస్తులు తీర్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

