అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తాజాగా హైదరాబాద్, చర్లపల్లి, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు చెప్పారు. సంబంధింత షెడ్యూల్ వివరాలను ఆదివారం వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తాజాగా హైదరాబాద్, చర్లపల్లి, శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు చెప్పారు. సంబంధింత షెడ్యూల్ వివరాలను ఆదివారం వెల్లడించారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 25వ వరకు ప్రతి శుక్రవారం రాత్రి 11:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే 07180 ప్రత్యేక రైలు రెండో రోజు ఉదయం 7:55 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 22 నుంచి డిసెంబర్ 27వ వరకు ప్రతి ఆదివారం ఉదయం 10:40 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే 07181 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
డిసెంబర్ 5 నుంచి అదేనెల 26వ వరకు ప్రతి శనివారం రాత్రి 11: 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే 07193 ప్రత్యేక ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. యాణంలో డిసెంబర్ 7 నుంచి 28వ వరకు ప్రతి సోమవారం ఉదయం 10:55 నిమిషాలకు కొల్లం నుంచి బయలుదేరే 07194 ప్రత్యేక ఎక్స్ప్రెస్ మరుసటి రోజు సాయంత్రం 6:30 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఈ నెల 22 నుంచి జనవరి 24వ వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:20 నిమిషాలకు మంచిలీపట్నం నుంచి బయలుదేరే నంబర్ 08539 ప్రత్యేక ఎక్స్ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9: 30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ నెల 24 నుంచి జనవరి 26వ వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే 08540 ప్రత్యేక ఎక్స్ప్రెస్ మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

