కైరో, నవంబర్ 16: సుమారు 4,500 ఏండ్ల క్రితంనాటి ఓ సూర్య దేవాలయాన్ని ఆఫ్రికా దేశం ఈజిప్టులో పురావస్తు శాఖ పరిశోధకులు తాజాగా గుర్తించారు. క్రీస్తుపూర్వం 25వ శతాబ్దానికి చెందిన ఫారోల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టు అంచనా వేస్తున్నారు. మట్టి ఇటుకలు, లైమ్ స్టోన్‌తో టెంపుల్‌ను కట్టినట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఆరు సన్ టెంపుల్స్ నిర్మించినట్టు చరిత్రలో ఉన్నదని, ఇప్పటివరకూ రెండింటిని గుర్తించినట్టు వివరించారు.