ముంబై : బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
గురువారం రాత్రి 11 గంటల సమయంటో ఆయన ట్వీట్ చేస్తూ.. గురువారం మధ్యాహ్నం తన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే తీసుకుంటానని గత నెలలో అమితాబ్ ప్రకటించిన విషయం విదితమే. గతేడాది బిగ్ బీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
T 3861 –
— Amitabh Bachchan (@SrBachchan) April 1, 2021
Got it done !
My CoviD vaccination this afternoon ..
All well .. 🙏