హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని సీటెల్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజినీర్స్ వార్షిక సదస్సులో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అల్లూరి వీ వీ ప్రసాదరాజు పాల్గొననున్నారు. ప్రసాదరాజు ప్యానల్ సభ్యుడిగా వ్యవహరిస్తారు. సదస్సు కౌన్సెల్ చైర్మన్ డేవిడ్ పొయిరియర్ నుంచి ప్రసాదరాజుకు ఆ హ్వానం అందింది. సదస్సులో 83 దేశాలనుంచి 385 మంది ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ మేధావులు సమర్పించే పత్రాలపై చర్చించనున్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థకు ఉపాధ్యక్షుడైన అల్లూరి 45 ఏండ్లుగా పారిశ్రామిక ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్లో అనుభవం గడించారు.