Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Allu Arjun | టాలీవుడ్లో మెగా అభిమానులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Allu Arjun | టాలీవుడ్లో మెగా అభిమానులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తలైవాను అభినందించే క్రమంలో బన్నీ ఉపయోగించిన పదజాలంపై కొందరు మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘‘చొక్కా నలగకుండా రూ.500 కోట్ల మార్కును కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’’ అంటూ తలైవా స్టార్‌డమ్‌ను బన్నీ ప్రశంసించడం మనం చూశాం.
సాధారణంగా ఇతర హీరోల విజయాలను అభినందించడం సినీ పరిశ్రమలో సహజమే. ఈ నేపథ్యంలో బన్నీ వ్యాఖ్యలను కూడా రజినీకాంత్‌పై అభిమానంతో చేసిన ప్రశంసలుగానే చూడాలని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాని రజినీకాంత్‌ను ప్రశంసించే క్రమంలో ‘‘ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’’ అనే భావన వచ్చేలా వ్యాఖ్యానించడం మెగాస్టార్ చిరంజీవిని పరోక్షంగా తక్కువ చేసినట్లుగా ఉందని కొందరు మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి బాక్సాఫీస్ సత్తాను తక్కువ చేసి చూపించేందుకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.
అయితే బన్నీ ఉద్దేశం చిరంజీవిని అవమానించడం కాదని, తెరపై ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించడమేనని అభిమానులు వాదిస్తున్నారు. ఒక స్టార్‌ను పొగిడినంత మాత్రాన మరో స్టార్‌ను తక్కువ చేసినట్లు భావించడం సరికాదని కౌంటర్లు ఇస్తున్నారు. కాగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత మెగా, అల్లు అభిమానుల మధ్య విభేదాలు మరింత బహిరంగంగా చర్చకు వచ్చాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల అభిమానులు వివిధ సందర్భాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ‘జైలర్ 2’ విజయంపై బన్నీ చేసిన వ్యాఖ్యలు కూడా అదే వివాదానికి మరో కారణంగా మారాయి. ప్రస్తుతం ‘ఎక్స్’ వేదికగా మెగా, అల్లు అభిమానుల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతుంది. మరి దీనికి ఎలా ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

