స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నాడు. ఆయనకు కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు బెంగళూరు, చెన్నై, కేరళ వంటి చోట్ల భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారబోతున్నాడు బన్నీ. అయితే శుక్రవారం రోజు బన్నీ తన 38వ బర్త్ డే ను జరుపుకోగా, ఆయనకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో శుభాకాంక్షలు తెలియజేశారు .
పుష్ప టీజర్ ఈవెంట్లో బన్నీతో ప్రత్యేక కేక్ కట్ చేయించింది చిత్ర బృందం. ఈ కేక్ ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటివరకూ బన్ని నటించిన 20 సినిమాల పేర్లతో ఈ కేక్ ని డిజైన్ చేయించారు. భారీ దీర్ఘచతురస్రాకార కేకులో నాలుగు వైపులా AA అనే అక్షరాలు ఉన్నాయి. కేక్ ఉపరితలంపై బన్ని నటించిన చిత్రాల పేర్లు ఉన్నాయి. గంగోత్రి- ఆర్య-ఆర్య2- దేశముదురు- సరైనోడు- జులాయి- రేసుగుర్రం ఇలా.. తాజా చిత్రం పుష్ప వరకూ పేర్లను ముద్రించారు. కేక్ తయారు చేసిన వారి క్రియేటివిటీకి అంతా మంత్ర ముగ్ధులవుతున్నారు.