హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి భక్తులు ఫేస్‌రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో గదుల రొటేషన్ తగ్గడమేగాక, దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతున్నదని తెలిపారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకొంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొందుతారని పేర్కొన్నారు. మళ్లీ నేరుగా వెళ్లి గది ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ అవుతుందని చెప్పారు. ఒకసారి తమ ఆధార్‌కార్డుతో గదులు పొందిన భక్తులకు మళ్లీ 30 రోజుల తర్వాతే అవకాశం ఉంటుందన్నారు.