ఈఎస్ఐలో రూ. 50 కోట్ల కుంభకోణం
ఈఎస్ఐలో భారీ అవినీతి చోటుచేసుకున్నదని భారత ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు వేముల మారయ్య ఆరోపించారు.
- క్లీనింగ్ కాంట్రాక్టుల్లో భారీ అక్రమాలు
- బీఆర్టీయూ నేత మారయ్య
ఉప్పల్, నవంబర్ 6: ఈఎస్ఐలో భారీ అవినీతి చోటుచేసుకున్నదని భారత ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు వేముల మారయ్య ఆరోపించారు. ఈఎస్ఐ వైద్యశాలలు, డిస్పెన్సరీల్లో పారిశుద్ధ్య నిర్వహణ పేరుతో సుమారు 50 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ప్రస్తుత సంవత్సరంలోనే రూ. 30 కోట్ల స్కామ్ జరిగిందని తెలిపారు.
హెచ్ఎంటీ నగర్‌లోని తన కార్యాలయం లో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ గౌతమ్ తన కు నచ్చిన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రభుత్వ నిధులు ధుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి, వైద్య సేవల వైఫల్యాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, జాయింట్ డైరెక్టర్ గౌతమ్‌ను ఉద్యోగం నుంచి తొలగించి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

